కోదాడ పట్టణంలో శనివారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి 11 గంటల దాటినా సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణించవలసి వచ్చింది. పాఠశాలలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు మంచు కారణంగా చలితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.