జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీలో శనివారం ర్యాలీ నిర్వహించారు. అధికారులు విద్యార్థులు పట్టణ పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ ఓటు హక్కు పై ప్రజలకు అవగాహన కల్పించారు. తహశీసిల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.