రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు వేశారని.. ఇకనైనా ఆ వేషాలను ఆపాలని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.ఇవాళ ఆమె వరంగల్)లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పథకాలపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులను ఆందోళనకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ.. అలా చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని అమె తెలిపారు. నిరుపేదలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దని అన్నారు.రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కొత్త రేషన్ కార్డులు) ఇచ్చిన పాపాన పోలేదని కామెంట్ చేశారు. భూమి లేని రైతు కూలీలను అధ్వన్నంగా చూశారని.. రూ.కోట్లు ఉన్న ఆసాములకు మాత్రం 'రైతు బంధు' సాయం ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నిరుపేదల అభ్యున్నతిని దృష్టి పెట్టుకుని కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు , రైతు భరోసా (Raithu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉన్నట్లుందని.. అందుకే చిల్లర వేషాలు వేస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు