ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెక్కల్లో లేని రూ. 4 లక్షలు సీజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 02:51 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఎస్.ఎస్.టి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పురుమండ్ల వెంకట్ రెడ్డికి చెందిన టీఎస్ 09 ఈఆర్ 7367 నెంబర్ గల వాహనంలో అనుమానాస్పదంగా రూ. 4 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన విధానాల ప్రకారం ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు, పూర్తి వివరాల కోసం విచారణ చేస్తున్నట్లు పట్టణ సీఐ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa