ఆధునిక జీవన శైలిలో చాలా మందికి ఆకలి మందగిస్తుంటుంది. అయితే, సాధారణ ఉప్పుతో నింపిన తాజా అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి భోజనానికి 10 నిమిషాల ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఎండుద్రాక్ష, కరక్కాయ, తియ్యని పటికను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేయాలి. దీన్ని గోరువెచ్చని నీటితో రోజుకు 2-4 గ్రాములు తీసుకుంటే ఆకలిని పెంచుతుందంటున్నారు.