చాలా మందిని జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వంటింటి చిట్కాలతో వాటికి చెక్ పెట్టొచ్చు. ఉల్లిపాయ రసాన్ని తలకు కాటన్ సాయంతో పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం ఉంటుంది. చుండ్రును తగ్గించి, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. తలస్నానం చేసే ముందు పెరుగుతో మసాజ్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. మురికిని వదిలించి, దురదను తగ్గిస్తుంది. జుట్టుకు మెరుపు అందిస్తుంది.