కప్పు ఆముదం నూనె, టీస్పూన్ రోజ్ మేరీ నూనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భద్రపరచుకుని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తీసుకునే ఆహారంలో ఎ, బి, సి, డి, ఇ వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య పోతుంది.