గిద్దలూరు పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులోని బలిజ సేవాసంఘం నూతనంగా నిర్మించిన మిని కల్యాణ మండపాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కాపుల అభివృద్ధికి తనపూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, కంభం మండల కేంద్రాలలో కాపు భవ న నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నట్లు తెలిపారు.
ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులను మధ్యలోనే ఆపివేసింద న్నారు. తిరిగి ఆ భవనాల పూర్తికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కాపు సంఘం ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుప్పా రంగనాయకులు, కాపు సంఘం ప్రతినిధులు దుత్తా బాలీశ్వరయ్య, ఆర్‌డీ.రామక్రిష్ణ, కమతం శ్రీనివాసులు, యగటీల రంగస్వామి, ముద్దర్ల శ్రీనివాసులు, యగటీల రవి, పసుపులేటి శ్రీనివాస్, బాలచెన్నయ్య పాల్గొన్నారు.