టెక్కలి మండలం స్థానిక ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం జరుగుతున్న నాస్ పరీక్షను ఎంఈఓ డి.చిన్నారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఇటువంటి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫాంట్ జీసస్ ప్రిన్సిపాల్, ఫీల్డ్ ఇన్విజిరేటర్, సి. ఆర్. ఎం. టి లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.