కాకినాడ సముద్రతీరంలో ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సీరియస్ అయ్యారు. వాటి సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కాకినాడ సముద్రంలో హోప్ ఐల్యాండ్ సమీపంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చేపలవేట నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఆదేశాలను ప్రతి బోటు యజమాని, మత్స్యకారులు పాటించాలని కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మెరైన్, పోలీసు, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతిరోజూ తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోప్ ఐల్యాండ్ దాటిన తర్వాత చేపలవేట చేసే మత్స్యకారులకు ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు వలలో చిక్కితే వాటిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టాలని ఆదేశించామన్నారు.