రాబోయే మూడు నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పదివేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్‌ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అన్నారు. విలువలతో కూడిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ.25 కోట్లు, హుద్ హుద్ తుపాను సమయంలో మూడు కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా అని గుర్తుచేశారు. భీమవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పెదఅయినంలో రతన్‌టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు.