సినిమా రంగంలో రాముడైనా.. రావణాసురుడైనా ఎన్టీఆర్ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళలు అన్నగా పిలిచిన... ఆరాధ్య దైవంగా పిలిచిన అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. సినిమా రంగంలో నటన ఎన్టీఆర్‌కు తెలుసుగాని... రాజకీయరంగంలో నటన అనేదే ఎన్టీఆర్‌కు తెలియదన్నారు. కోటి దాటినా పార్టీ సభ్యత్వ నమోదుతో తాత ఎన్టీఆర్‌కు లోకేష్ నిజమైన నివాళులర్పించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఒడిదుడుకులు ఎదురవుతున్న చంద్రబాబు నడిపిస్తూనే వస్తున్నారన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం చంద్రబాబు, లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు.