నోటి దుర్వాసనని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఈ సమస్య రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. దీంతో ఎదుటివారితో మాట్లాడడం, నవ్వడానికి కూడా చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సరిగా మాట్లాడలేరు. చూడ్డానికి చిన్న సమస్యగా కనిపించినా దీనిని పట్టించుకోకపోతే ఇదే పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యని దూరం చేసేందుకు రకరకాల పేస్టులు, ఇతర సొల్యూషన్స్ వాడతారు. వీటి వల్ల సమస్య కొంతవరకూ తగ్గినా ఇది శాశ్వతం కాదు. పైగా ఇవన్నీ కూడా కెమికల్స్‌తో కూడినవి. వీటిని ఎక్కువగా వాడడం సరికాదు. అందుకోసం, ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో సహజ ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. కాబట్టి, దీనిని మౌత్‌వాష్‌లోని వాడతారు. ఇందులోని ఆమ్ల లక్షణం కారణంగా జెర్మ్స్, బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనికోసం ఓ కప్పు గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల వైట్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. దీంతో కనీసం 30 సెకన్ల పాటు మీ నోటిని క్లీన్ చేసుకోండి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్
నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రిక్ ఉండే పండ్లని ముక్కని నమిలి తినండి. సిట్రిక్ యాసిడ్ లాలాజ గ్రంథులను ప్రేరేపిస్తుంది. దీంతో దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు చాలా మంచివి.
తులసి ఆకులు
తులసి ఆకులు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీంతో కూడా సమస్యని దూరం చేసుకోవచ్చు. దీనికోసం తులసి ఆకులని శుభ్రంగా క్లీన్ చేసి నమలండి. లేదా వీటితో టీ చేసుకుని తాగండి. తులసిలో క్లోరోఫిల్ ఉంటుంది. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది. పైగా దీనిని తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది.
ఆవనూనెతో
పళ్ళని క్లీన్ చేయడానికి ఆవనూనెలో కొద్దిగా ఉప్పు కలిపి తోమండి. దీంతో కావిటీస్, ఫ్లాక్ చేరకుండా ఉంటుంది. ఆవనూనె ఎందుకంటే ఈ నూనెలో యాంటీ మైక్రోబయల్ గుణం ఉంది. ఇది చిగుళ్లపై బ్యాక్టీరియా ఏర్పడకుండా నాశనం చేస్తుంది. దీంతో చిగుళ్లు కూడా బలంగా మారతాయి.
భోజనం తర్వాత
భోజనం తర్వాత వాసన రాకుండా ఉండేందుకు సోంపు గింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, పార్స్లీ, తులసి, పిప్పరమెంట్ సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాలని పరిమిత మోతాదులో నమిలి తినండి. దీంతో దుర్వాసన తగ్గుతుంది.