డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది.వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుట్రలు చేస్తోంది. డీబీఆర్ ఆసుపత్రి రోడ్‌లో శేఖర్ రెడ్డి ఐదు అంతస్థుల భవనం నిర్మాణంలో ఉండగా మూడవ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వాలి. 15 రోజులు సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో కూల్చివేతకు దిగుతున్నారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని అభినయ్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.