పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిందని, పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని 1వ వార్డులో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పింఛన్‌ను పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఏటా రూ. 250 పెంచుతానన్న జగన్మోహన్‌రెడ్డి మాట త ప్పారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ను పెంచటంతో పాటు ప్రతి నెలా 1వ తేదీనే ఇస్తున్నారన్నారు.
మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో పబ్లిసిటీ తప్ప అభివృద్ధి శూన్యమని న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ అన్నారు. పట్టణంలోని 1వ వార్డులో అసంపూర్తి నిర్మాణంతో ఉన్న నీళ్ల ట్యాంకును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ మేరకు ట్యాంకు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి వెంట కమిషనర్ నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్ నాగార్జున, తెలుగు దేశం పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.