ఒడిశాలోని కలహండి జిల్లా ధరమ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగలను తాజాగా పోలీసులు పట్టుకున్నారు. అనేక దోపిడీలు, దొంగతనాల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. జార్ఖండ్‌కు చెందిన 8 మంది దొంగలను పట్టుకుని, వారి నుంచి రూ.3.51 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు అనేక ఆయుధాలు, ఇతర వస్తువులు కూడా దొంగల వద్ద పట్టుబడ్డాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.