విశాఖలోని రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదాను పునరుద్ధరించడం తెలిసిందే. బ్లూ ఫ్లాగ్ జ్యూరీ శుక్రవారం నాడు రుషికొండ బీచ్ ను పరిశీలించి, అన్ని అంశాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ముఖ్యంగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వివరించారు. మరి కొన్ని బీచ్ లకు కూడా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
![]() |
![]() |