హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రక్కడ్ గ్రామంలో పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా గూగా ఆలయ సందర్శనకు వెళ్లిన కుటుంబంపై కందిరీగల దాడి జరిగింది. ఈ దాడిలో వరుడు నవీన్ సింగ్ సహా మొత్తం 25 మంది గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని నాడౌన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా వివాహ వేడుకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
![]() |
![]() |