బెంగళూరు : ప్రముఖ లింగాయత్ మరియు బసవధర్మ పీఠం అధ్యక్షురాలు మాతే మహాదేవి(74) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మార్చి 9న ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహాదేవి మృతిపట్ల లింగాయత్ పెద్దలు, కులస్తులు సంతాపం ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇవాళ జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa