చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే వ్యక్తి తాగిన మత్తులో భార్యకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని రోడ్డుపై నిల్చున్నాడు. భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పీకలదాకా తాగి భార్యకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత రోడ్డుపైనే ఇద్దరూ కాసేపు తిట్టుకున్న తర్వాత పాన్ వెళ్లి బిజీ రోడ్డు మధ్యలో నిల్చున్నాడు. భార్య తనను ఎంత లాగడానికి ప్రయత్నించినా.. అతను మాత్రం అలాగే మొండిగా నిల్చున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ వచ్చి అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు, ఛాతీకి తీవ్ర గాయాలతో పాన్ ఆసుపత్రి పాలయ్యాడు. నాపై నిజంగా నా భార్యకు ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని రోడ్డుపై నిల్చున్నాను. చివరికి ఇలా అయింది అంటూ ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతూ వాపోతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa