ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ ఎప్పుడంటే ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2020, 07:28 PM

క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా బబ్లీ బ్యూటీ రాశీఖ‌న్నా, అలాగే ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌ గా రాబోతున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’.  ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 6న సాయంత్రం 4 గంటల 05 నిముషాలకు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కూల్ కంపోజర్ గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa