తన 27వ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వంశీ పైడిపల్లికి అప్పగించాడు నటుడు మహేష్ బాబు. ‘సరిలేరు’ సక్సెస్ మీట్‌లో ‘మహర్షి, సరిలేరు’ చిత్రాల కంటే గొప్ప చిత్రాన్ని అభిమానులకు అందిస్తానని వంశీ మాటిచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే నటుడు విజయ్ దేవరకొండ– మహేష్ బాబు ఒకే స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. మహేష్-వంశీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు సమాచారం. విజయ్ కోసం వంశీ స్పెషల్ క్యారెక్టర్ రూపొందిచనట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో విజయ్‌ది కీలక పాత్రన లేక అతిథి పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. మహేష్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా విజయ్ కూడా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa