హీరో సూర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏటి. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈరోజు పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఈరోజు విడుదల కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్, సత్యరాజ్, జయప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa