సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. పుష్పా ది రైజ్ పేరుతో తొలి భాగం డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక్క తెలుగులోనే ఈ పాటకు 34 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వన్ మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa