జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్నచిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ మూవీ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు. అయితే ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి 'సంచారి' అనే సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ పాడారు. కృష్ణకాంత్ రచించారు. జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు సమకూర్చారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక జరగనున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa