ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుమ్మురేపుతున్న పుష్ప కలెక్షన్లు.. ఏకంగా రూ 365 కోట్లు వసూలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 09:41 PM

పుష్ప ఆల్ టైం రికార్డు సాధించడమే కాకుండా తక్కువ సమయంలో భారీ వసూళ్లను రాబడుతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' డిసెంబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజుతో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలైంది. 50 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. తొలిరోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న 'పుష్ప' దానిని తట్టుకుని నిలబడింది. హిందీలోను అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుంచి కూడా బాగానే వసూలు చేసింది. ఇతర భాషల్లోను తన సత్తాను చాటుకుంది. కథాకథనాలు .. ముఖ్యమైన పాత్రలను సుకుమార్ మలిచిన తీరు .. బన్నీ మేనరిజం .. దేవిశ్రీ పాటలు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడానికి కారణమని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు సెకండ్ పార్టు షూటింగుకు ముస్తాబవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa