టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తునా"ఖిలాడి" ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది .రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది.అప్డేట్ ప్రకారం ,ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 154 నిమిషాల రన్‌టైమ్ తో ఉంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయడం ద్వారా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది అని "ఖిలాడి" టీమ్ వెళ్ళడించారు.పెన్ మూవీస్ మరియు ఎ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ముఖేష్ రిషి మరియు రావు రమేష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa