ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా జగపతిబాబు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 09:30 PM

టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 60వ జన్మదినం సందర్భంగా అవయవదానం చేయబోతున్నట్లు ప్రకటించాడు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో అవయవదాన సదస్సుకు జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ మనం మనుషులుగా పుట్టాం. మనుషులుగా చనిపోతాం. వెళ్లేటపుడు 200 గ్రాముల బూడిద తప్ప ఏమి మిగలదు అని అయన అన్నారు.ఈ అవయవ దానం ద్వారా మనం చనిపోయినా మరో 7, 8 మందికి పునర్జన్మ ఇవ్వవచ్చు అని అయన తెలిపారు.అవయవదానం చేసిన వారికి కూడా పద్మశ్రీ ఇవ్వాలి అని అయన అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa