ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 12:27 PM

కొన్నాళ్ల క్రితం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క. తను సినిమా చేసిందంటే సూపర్ డూపర్ హిట్టే అనుకున్న దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ ఎందుకో తెలీదు అనుష్క.. వెండితెరకు దూరమయ్యి చాలాకాలమే అయ్యింది. తాను చివరిగా నటించిన 'నిశ్శబ్దం' చిత్రం కూడా ఓటీటీలోనే విడుదలయ్యింది. అయితే ఇటీవల ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ క్యాసింగ్ కౌచ్‌పై నోరువిప్పింది. అనుష్క సినిమాల్లో ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోతుంది. ఆ క్యారెక్టర్‌ను అనుష్క తప్ప మరెవరూ చేయలేరేమో అనేంతలా అందులో లీనమైపోతుంది. కానీ ఆఫ్ స్క్రీన్ అనుష్కకు చాలా మోహమాటం. ఎక్కువగా మాట్లాడదు. తన సినిమాలను ప్రమోట్ చేస్తున్న సమయంలో కూడా అనుష్క చాలా తక్కువగా మాట్లాడుతుంది. అందుకే అనుష్క ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ కూడా అభిమానులకు చాలా ఇష్టం. అలా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే అనుష్క మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది.


టాలీవుడ్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది అనుష్క. అవకాశాల ఇస్తామని చెప్పి వేధింపులకు గురిచేసే వారు ఏ పరిశ్రమలో అయినా ఉన్నారని చెప్పింది అనుష్క. అంతే కాకుండా తాను కూడా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చిందట. కానీ తాను ఏదైనా సూటిగా చెప్పేస్తుందని అందుకే తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని తెలిపింది అనుష్క. చాలామంది అమ్మాయిలు ఇలాంటి వాటివల్ల ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేసింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa