నటి రష్మిక ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో రష్మిక చెప్పారు. తన దృష్టిలో ప్రేమంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, సమయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఏర్పడటం అని ఆమె చెప్పారు. ఇవన్నీ రెండు వైపుల నుంచి ఉన్నప్పుడే ప్రేమ విజయం సాధిస్తుందని అన్నారు. తాను ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదని ఆమె స్పష్టం చేశారు. మనం ఎవరితోనైతే సంతోషంగా, సురక్షితంగా ఉంటామో వాళ్లనే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుందని రష్మిక చెప్పారు.