తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా, గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అడవిని నాగార్జున దత్తత తీసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa