డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్, మోహన్ బాబు,ప్రగ్యా జైస్వాల్ "సన్ ఆఫ్ ఇండియా" సినిమా లో నటిస్తున్నారు.మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా మారారు.ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ,ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. అంతేకాకుండా ఈ సినిమా 85 నిమిషాలు రన్ టైమ్ కలిగి ఉంది అని కన్ఫర్మ్ చేసారు .శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు.క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa