ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫైర్ ఉందని అవకాశాలివ్వలేదు: సమీర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 01:10 PM
ప్రముఖ తెలుగు సినీ, సీరియల్ నటుడు సమీర్ తన జీవితంలో గడ్డు కాలం గురించి ఎన్నో విషయాలు ఇటీవల మీడియాతో పంచుకున్నాడు. ఒకానొక సమయంలో తనను సీరియల్స్ నుంచి తీసేయడంపై కీలక విషయాలను వెల్లడించాడు. తన కెరీర్ ప్రారంభంలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయనను సీరియల్స్ నుంచి తొలగించడంపై నోరు విప్పాడు. నా మొగుడు నాకు సొంతం సీరియల్ చేస్తుండగా మధ్యలోనే తనను తీసేశారన్నాడు. ఆ సమయంలో సీరియల్ హీరోయిన్‌తో తనకు ఎఫైర్ ఉందని కొందరు దుష్ప్రచారం చేశారన్నాడు. దీంతో సీరియల్‌కు చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతో తనను యాజమాన్యం తొలగించిందన్నాడు. కనీసం ఏం జరిగిందనే విషయం తెలుసుకోకుండా తనను అకస్మాత్తుగా తీసేశారన్నాడు. ఈఎంఐలు కట్టలేక, ఇంటి అద్దెలు కూడా చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పాడు. తరువాత వాస్తవం తెలియడంతో తనకు ఆ సీరియల్ యాజమాన్యం క్షమాపణ చెప్పినట్లు పేర్కొన్నాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa