సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి "భీమ్లా నాయక్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ నెల 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,"భీమ్లా నాయక్" థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 19న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ ఆఫిసిఅల్ గా ఈరోజు అనౌన్స్ చేయనున్నారు.ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది అని మేకర్స్ వెల్లడించారు."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa