యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం"రాజా వారు రాణి గారు", ఎ"స్ఆర్ కళ్యాణమండపం"సినిమాలతో హిట్ సాధించాడు.అతని రాబోయే చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’పల్లెటూరి కథతో వస్తున్న ఈ సినిమా లో రాత్రి అంధత్వం ఉన్న క్యారెక్టర్ లో కిరణ్ కనిపించనున్నాడు.బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నమ్రత దారేకర్, కోమలి ప్రసాద్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు .మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి 'హేలీ' అనే టైటిల్ తో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ అందరిని అట్ట్రాక్ట్ చేస్తుంది.సనాపతి భరద్వాజ్ పాత్రుడు ఈ సాంగ్ లిరిక్స్ రాయగా ,కపిలన్ పాడారు. ఈ సినిమా లో కోమలి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి రఘువరన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోతి సినిమాస్‌పై ప్రమోద్ మరియు రాజు నిర్మిస్తున్నారు.ఈ కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa