ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు ప్రారంభమైన "NBK107"సినిమా షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 03:36 PM

బాలయ్య ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన "అఖండ" సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.బాలయ్య ,  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లో తన అప్ కమింగ్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.అధిక బడ్జెట్ తో తీస్తున్నా ఈ సినిమా పూజా కార్యక్రమం నవంబర్ 13, 2021న జరిగింది.ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది.దునియా విజయ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.ఈ సినిమా  రెగ్యులర్ షూట్ ఈ రోజు నుండి సిరిసిల్లలో స్టార్ట్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు .ఈ మాస్ డ్రామా సినిమాకి యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్  కొరియోగ్రఫీ చేస్తున్నారు.NBK107 సినిమాలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించనున్నారు అని మూవీ మేకర్స్ వెళ్ళడించారు.ఈ 2022 దసరాకి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్‌ని పెట్టినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa