కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఓ సినిమాలో నటిస్తున్నారు. కన్నడ చిత్రం ‘తనుజ’లో ఆయన సీఎం పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకి హరీష్ ఎండి హల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే యడ్యూరప్పపై కొంత భాగం చిత్రీకరించారు.గతంలో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు తనూజ అనే యువతి కరోనాతో నీట్ పరీక్షలు రాయలేకపోయింది.అయితే ఆమె ఇద్దరు జర్నలిస్టుల సహాయంతో ఆ పరీక్షను పూర్తి రాసింది. పరీక్ష రాయడానికి దాదాపుగా ఆమె 350 కి.మీ ప్రయాణించింది. నీట్ పరీక్షలో విజయం సాధించింది. అప్పట్లో ఈ యువతి ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి రవీంద్రనాథ్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్.బి.ఉమేష్ ఎడిటర్.బియాండ్ విజన్ సినిమాస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa