సంగీతం పట్ల ఉన్న ఆసక్తి , సంగీత కళా రంగంలో అభివృద్ధి చెందిన సాంకేతికత దృష్టిలో ఉంచుకొని స్నేహితులు కలిసి నూతనంగా రిధమ్ ఆన్ లైన్ పేరుతో స్టూడియోను ప్రారంభించారు. సికింద్రాబాదులోని మడ్ ఫోర్డ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రిధమ్ ఆన్లైన్ స్టూడియోను ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ ప్రారంభించారు. రికార్డింగ్ కళను మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న పరికరాలను స్టూడియో లో పొందుపరిచినట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నప్పటికీ సంగీతం రికార్డింగ్ కళలకు సంబంధించి సాంకేతిక విషయంలో ఇంకా మెరుగవాల్సిందని అన్నారు. నగరంలో రికార్డింగ్ ఆర్టిస్టుల డిమాండ్లకు తగ్గ విధంగా అకౌస్టిషన్ తో రూపొందించబడిన మొట్టమొదటి స్టూడియో ఇదే అని అన్నారు. నాణ్యమైన సంగీతాన్ని అందించాలనే సంకల్పంతో స్టూడియోను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికె ఓటిటి, యూట్యూబ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో అత్యాధునిక పరికరాలతో సాంకేతిక పరిజ్ఞానంతో సంగీతాన్ని రికార్డింగ్ చేయవచ్చని అన్నారు. నగరంలో అనేక రికార్డింగ్ స్టూడియో లు ఉన్నప్పటికీ రికార్డింగ్ చేసే సమయంలో లోపాలు ఉంటాయని తమ వద్ద సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్తమమైన రికార్డింగ్ రూమ్ కలిగి ఉన్నట్లు తెలిపారు.