బుల్లితెర ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో..ఓటీటీ వెర్షన్ కు రెడీ అయింది. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం కానుంది.'బంపర్ ఆఫర్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ బిందు మాధవి (Bindhu Madhavi). ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ .. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు అవకాశాలు తగ్గడంతో...కోలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు.. ఈ సారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మళ్లీ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa