ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయ‌క్' మూవీ రిలీజ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఆంక్ష‌లు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 09:41 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలసి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భీమ్లా నాయక'. ఈ సినిమాకి  సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ విషయంలో ఏపీలో పలు సినిమా థియేటర్లకు వైసీపీ ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది.బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. టిక్కెట్ ధరలు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని థియేటర్ల యాజమాన్యాలపై నోటీసుల్లో హెచ్చరించారు. అలాగే  థియేటర్ల దగ్గరా రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుంది అని తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa