ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ చిత్ర పరిశ్రమకి హైదరాబాద్‌ని హబ్‌గా చేస్తాం: మంత్రి కేటీఆర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 11:23 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలసి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భీమ్లా నాయక'. ఈ సినిమాకి  సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడ్తూ... ఈ ఈవెంట్‌కి నన్ను ఆహ్వానించిన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు.. నాలుగేళ్ల క్రితం చరణ్ సినిమా ఫంక్షన్‌కి వచ్చాను. ఇదే మైదానంలో అప్పుడు నేను మాట్లాడుతూ మీ పేరు రాగానే అరుపులే వినిపించాయి. నేను ఇక్కడికి ప్రభుత్వ మంత్రిగా రాలేదు పవన్ సోదరుడిగా వచ్చాను. పవన కళ్యాణ్ చాలా మంచి మనసున్న మనిషి.. చాలా మంది స్టార్స్ ఉంటారు. అయితే ఈ ఫ్యాన్స్ నీ కోసమే. కాలేజీ రోజుల్లో తొలిప్రేమ సినిమా చూశాము.అప్పట్నుంచి ఇప్పటికీ అదే స్టార్ డమ్. ఫ్యాన్స్ గుండెల్లో స్థానం సంపాదించడం అసాధ్యం..కానీ మీకు మాత్రమే అది సాధ్యమైంది.చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను తెలుగు పరిశ్రమకే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు హబ్‌గా మార్చాలనుకుంటున్నాం. దానికోసం కష్టపడుతున్నా. పవన్ లాంటి స్టార్స్ అందరూ సపోర్ట్ చేస్తే కచ్చితంగా జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa