ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజ్ డేట్ ని లాక్ చేసిన 'జన గణ మన'

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 10:56 AM

డిజో జోస్ ఆంటోని దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న 'జన గణ మన' మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసారు.'ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సూరజ్ వెంజరమూడు ఈ సినిమాలో పోలీసుగా నటించాడు.ఏప్రిల్ 28,2022న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుందని పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను పోస్ట్ చేసి విడుదల తేదీని ప్రకటించారు.గత ఏడాది విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఈ మూవీపై భారీ అంచనాలను పెంచింది అని చెప్పొచ్చు.క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ మూవీ కోసం సినిమా ప్రేమికులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .విన్సీ అలోషియస్,సిద్ధిక్,బెంజి మాథ్యూస్,ఆనంద్ బాల్,లిటిల్ దర్శన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అండ్ మ్యాజిక్ ఫ్రేమ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa