ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన 'స్టాండ్ అప్ రాహుల్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 01:15 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్‌' సినిమాతో మార్చి 18,2022న ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
సంతోమోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామిక్ పాత్రలో నటించాడు.వెన్నెల కిషోర్,దేవి ప్రసాద్,మధురిమ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 8,2022 నుండి ఈ సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ఆహా అధికారికంగా ప్రకటించింది.డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని అండ్  భరత్ మాగులూరి ఈ సినిమాని  నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa