దేశదృష్టిని మొత్తం ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. తొంభైలలో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న అవమానాలు, వారిపై జరిగిన అకృత్యాలు, వారి ఊచకోత నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. దేశప్రజలకు తెలియని కాశ్మీర్ అంతర్గత విషయాలను ఈ సినిమాతో బహిర్గతం చేశారు వివేక్. దేశ ప్రధాని నరేంద్రమోడీ మెప్పును సైతం ఈ మూవీ పొందడం విశేషం. ఈ సినిమాకు ప్రశంసలు ఎంతలా వచ్చాయో విమర్శలు, నిరసనలు కూడా అదేవిధంగా వెల్లువెత్తాయి. అయితే ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోని ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ఆదరించారు. బాలీవుడ్లో దాదాపు 250కోట్ల భారీ కలెక్షన్లతో అక్కడి రికార్డులను తిరగరాస్తుంది. ధియేటర్ల గోడలను బద్దలు చేసిన ఈ మూవీ ఓటిటిలో సందడి చేయటానికి రెడీ అయింది. మరో మూడు రోజుల్లో అంటే మే 13 నుండి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రముఖ జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు ఇదొక శుభవార్త లాంటిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa