ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వేయి కన్నులతో' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 14, 2023, 12:55 PM

వేయి కన్నులతో వేచి చూస్తున్నా… తెర చాటు దాటి చేరదా, నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా… కరుణించి ఆదరించదా, నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా… మన్నించి అందుకోవా నేస్తమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్నూ
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంత గాధ పెంచినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్న… నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం

ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి… ఒక్కసారి… ల ల ల
ఒక్కసారి అయినా…. చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం

ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా… వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా… కలుసుకోను చెప్పుమా..!
ఎన్ని జన్మలైనా…. పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని

వేయి కన్నులతో వేచి చూస్తున్నా… తెర చాటు దాటి చేరదా, నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా… కరుణించి ఆదరించదా, నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా… మన్నించి అందుకోవా నేస్తమా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com