ఏ జన్మ బంధమో ఈ స్నేహం..ఏ దివ్య రూపమో నేస్తం
ఇన్నాళ్ళ మౌనమా ఈ రాగం..ఎన్నాళ్ళ కొచ్చేనా సాయం.
నేనున్నా అంది నీ చూపే,నేనున్నా ధ్యాస నీ వైపే
అవునన్నా ఎవరు కాదన్నా,నువ్వే నా ప్రాణం ప్రాణం
స్నేహాన్ని దాటాను ప్రేమతో,ఈ దేహాన్ని వీడాలి ప్రేమలో
నీ నీడగా నీ చెలికాడుగా ప్రేమిస్తాను నీకన్నా నిన్నెంతో!!!!!!
ఏ జన్మ బంధమో ఈ స్నేహం..ఏ దివ్య రూపమో నేస్తం
ఇన్నాళ్ళ మౌనమా ఈ రాగం..ఎన్నాళ్ళ కొచ్చేనా సాయం.
నేనున్నా అంది నీ చూపే,నేనున్నా ధ్యాస నీ వైపే
అవునన్నా ఎవరు కాదన్నా,నువ్వే నా ప్రాణం ప్రాణం
ఎంతెంత దూరం ఆనంద తీరం అనుకుంటూ బ్రతికా ఇన్నాళ్ళు
గోరంత స్నేహం కొండంత తోడై కనిపించగానే కన్నీళ్ళు
గుండెల్లో గాయాలు మాయమై,నీరెండల్లో సెలయేటి స్నానమై
నిను కోరితే నీ ఒడి చేరితే మనసేగిరింది మేఘాల దారుల్లో
అపురూప మైన బంగారు నువ్వు అనుకోని కలవై కలిసావు
క్షణకాలమైన విడలేను నిన్ను,కనురెప్పలోనే ఉంటావు
స్నేహాన్ని దాటాను ప్రేమతో,ఈ దేహాన్ని వీడాలి ప్రేమలో
నీ నీడగా నీ చెలికాడుగా ప్రేమిస్తాను నీకన్న నిన్నెంతో
మీ స్నేహగీతం