టెలివిజన్ రంగం గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు పరిస్ధితులన్నీ మారిపోయాయి. సినీ నటులను మించిన క్రేజ్, ఫాలోయింగ్ బుల్లితెర నటులకు దక్కుతోంది. నేమ్ అండ్ ఫేమ్ కానీ , పారితోషికం విషయంలో కానీ ఏమాత్రం తగ్గడం లేదు.ఇక సీరియల్స్ హీరోయిన్స్ కానీ ఇతర మహిళా నటులైతే స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కోవలోకే వస్తారు బుల్లితెర నటి జ్యోతిరాయ్.తెలుగు బుల్లితెరపై కన్నడ భామల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ టీవీ తీసుకున్నా అందులో ప్రసారమయ్యే ప్రతీ సీరియల్‌లో హీరో , హీరోయిన్లు, ఇతర లీడ్ రోల్స్‌లో కన్నడ నటీనటులే కనిపిస్తారు. ఇక రీసెంట్‌గా ఎండ్ కార్డ్ పడిన బిగ్‌బాస్ తెలుగు 8లో కన్నడ బ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిఖిల్ , ప్రేరణ, యష్మీ గౌడ, పృథ్వీరాజ్ శెట్టిలు ఒక బ్యాచ్‌గా ఆడుతూ తెలుగు వారిని డామినేట్ చేశారనే వాదనలు వినిపించాయి. అంతేకాదు.. ఈసారి విజేత కూడా కర్ణాటకకే చెందిన నిఖిల్ కావడం గమనార్హం.
మాతృభాష కన్నడం సహా పలు భాషల్లో ప్రసారమైన సీరియల్స్‌లో నటించిన జ్యోతీరాయ్. కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. జ్యోతీ రాయ్ అంటే గుర్తురాకపోవచ్చు కానీ జగతీ మేడం అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో కొడుకు కోసం తపించిపోయే తల్లి క్యారెక్టర్‌లో ఆమె అద్భుతంగా నటించారు. అంతకుముందే తెలుగు టెలివిజన్ రంగంలో పలు ధారావాహికల్లో నటించినా రానీ గుర్తింపు గుప్పెడంత మనసులో జగతీ క్యారెక్టర్‌తో ఆమె సంపాదించారు. ఇప్పటికీ జ్యోతీరాయ్‌గా కంటే జగతీ మేడం గానే ఆమెను జనం బాగా గుర్తుపెట్టుకుంటారు.సీరియల్స్‌లో చీరలో పద్ధతిగా కనిపించి ఆకట్టుకున్న జ్యోతి రాయ్ రియల్ లైఫ్‌లో మాత్రం దానికి పూర్తి భిన్నం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్‌లతో అందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఈమెను చూసిన వాళ్లంతా నిజంగా ఈమె జగతీ మేడమేనా అని అవాక్కవుతున్నారు. గతంలోనే పెళ్లి చేసుకున్న జ్యోతీరాయ్‌కి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో విభేదాల కారణంగా అతనికి విడాకులు ఇచ్చినట్లుగా టాక్.
యంగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ అలియాస్ సుకు పూర్వాజ్‌తో ప్రేమలో పడిన జగతీ మేడం.. అతనిని రెండో పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఆమె .. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మోడ్రన్ లుక్‌లో దిగిన ఫోటోలలో ఆమె గుండెలపై అందమైన రంగు రంగుల ఎగిరే సీతాకోక చిలుకను టాటూగా వేయించుకుంది జ్యోతీ రాయ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం జ్యోతీ రాయ్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.