by Suryaa Desk | Mon, Jan 27, 2025, 02:03 PM
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆల్మోస్ట్ సెకండ్ వీక్ ఎండింగ్‌కి వచ్చినా ఈ సినిమాకు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు.ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో 13వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే కేవలం మూడు రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. డిస్ట్రిబ్యూటర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టింది .
13 రోజుల వ్యవధిలో పలు రికార్డులను అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన రెండో హీరోగా నిలిచారు. అలాగే ఆర్ఆర్ఆర్ (రూ.16.63 కోట్లు) తర్వాత ఐదో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం (రూ.12.75 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో షేర్ పరంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం రికార్డును ఈ సినిమాను అధిగమించింది. ఇక 12వ రోజు వసూళ్లకు సంబంధించి రూ.4.88 కోట్ల షేర్‌తో టాప్ 2లో ఉన్న ఆర్ఆర్ఆర్ను .. సంక్రాంతికి వస్తున్నాం రూ.4.90 కోట్ల షేర్‌తో వెనక్కి నెట్టింది. ఈ లిస్ట్‌లో రూ.5.49 కోట్లతో బాహుబలి 2 అగ్రస్థానంలో నిలిచింది.ఇకపోతే.. 12 రోజుల వరకు నైజాంలో రూ.34.10 కోట్లు, సీడెడ్‌లో రూ.15.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.17.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.11.91 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.55 కోట్లు, గుంటూరులో రూ.9.31 కోట్లు, కృష్ణాలో రూ.8.43 కోట్లు, నెల్లూరులో రూ. 3.97 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 103.31 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7.30 కోట్లు, ఓవర్సీస్లో రూ. 14.50 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.174.3 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.
ఇక 13వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వీకెండ్ కావడంతో సాలీడ్ బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపింది. ఆదివారంతో వీకెండ్ ముగియగా.. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలుకానున్నాయి. మరి వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.
Latest News