by Suryaa Desk | Fri, Jan 24, 2025, 10:45 AM
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరమైంది కలర్స్ స్వాతి. ‘కలర్స్’ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ‘డేంజర్’, ‘అష్టాచెమ్మా’ సినిమాలతో హీరోయిన్‌గా మారింది స్వాతి. నిఖిల్‌తో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, సుమంత్‌తో ‘గోల్కోండ హై స్కూల్’ వంటి హిట్లు కొట్టిన స్వాతి, తమిళ్‌లో, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించింది. 2018లో తన బాయ్‌ఫ్రెండ్ వికాస్ వాసుని పెళ్లి చేసుకుంది స్వాతి..కేరళకు చెందిన వికాస్ వాసు, పైలైట్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన మూడేళ్లకే ఈ ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. 2023లో ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో నటించింది స్వాతి. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో విడాకుల గురించి అడిగితే, సమాధానం చెప్పనంటూ తేల్చి చెప్పేసింది..
తాజాగా మరోసారి స్వాతి విడాకుల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. స్వాతి, తన సోషల్ మీడియా అకౌంట్‌లో భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. సెలబ్రిటీలందరూ విడాకులకు ముందు ఇలా సోషల్ మీడియా అకౌంట్‌లో పెళ్లి ఫోటోలను, తన పార్టనర్‌కి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడం సంప్రదాయంగా మారింది. దీంతో స్వాతి కూడా ఇన్‌డైరెక్టుగా విడాకులను కన్ఫార్మ్ చేసినట్టేనని అంటున్నారు ఆమె అభిమానులు..శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించాడు. తాగుబోతు, కోపిష్టి అయిన భర్తను వదిలేసి, అతనితో విడాకులు తీసుకునే మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో స్వాతి నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
Latest News