by Suryaa Desk | Mon, Jan 20, 2025, 09:45 PM
టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీలక పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టారు. వారాహి గుడి, ఒక ఊరు నేపథ్యంలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ ముగ్గురు హీరోల పక్కన దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది కథానాయికలుగా నటించారు. అలాగే జయసుధ, ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
Latest News